Mon Dec 23 2024 03:22:49 GMT+0000 (Coordinated Universal Time)
నారాయణ మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు
సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిజనుల మెడపై కత్తిపెట్టేందుకే ముర్మును బీజేపీ వాడుకుంటుందని వ్యాఖ్యానించారు. మంచిర్యాల జిల్లాలో సీపీఐ మహాసభల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసినట్లు బీజేపీ గొప్పలు చెప్పుకుంటుందని, దాని వల్ల గిరిజనులకు ఏం ఉపయోగముంటుందని నారాయణ ప్రశ్నించారు. గిరిజనులపై నిజంగా ప్రేమ ఉంటే ముందుగా మంచిర్యాల జిల్లాలో గిరిజనులను ఆదుకోవాలని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
కమ్మునిస్టులు బలంగా ఉంటే...
ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయిన వెంటనే గిరిజనుల జీవితాలు ఎలా మారతాయో చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ నియంతలాగా వ్యవహరిస్తున్నారన్నారు. కమ్యునిస్టులు బలంగా ఉంటే దేశాన్ని అమ్ముకోనివ్వరన్న కారణంతోనే వరవరరావు, సాయిబాబా లాంటి వారిపై అక్రమ కేసులు పెట్టారని నారాయణ ధ్వజమెత్తారు. పేదోళ్లకు సబ్సిడీలు కత్తిరించి, పెద్దోళ్లకు సాయం చేయడమే ఈ మోదీ ప్రభుత్వం లక్ష్యమని నారాయణ మండి పడ్డారు.
Next Story