Mon Dec 23 2024 00:55:31 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections : సీపీఎం జాబితా విడుదల.. 14 మంది అభ్యర్థుల ఖరారు
సీపీఎం పథ్నాలుగు మందితో జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ తో పొత్తు ఖరారు కాకపోవడంతో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమయింది.
సీపీఎం పథ్నాలుగు మందితో జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ తో పొత్తు ఖరారు కాకపోవడంతో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమయింది. పథ్నాలుగు స్థానాలను అభ్యర్థులను ప్రకటించింది. పాలేరులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోట చేయనున్నారు. సత్తుపల్లిలో భారతిని బరిలోకి దింపనున్నారు. ఇలా పథ్నాలుగు స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను సీపీఎం ప్రకటించింది.
పొత్తు చర్చలు...
కాంగ్రెస్ తో పొత్తుకోసం సీపీఎం ప్రయత్నించింది. అయితే పొత్తు చర్చలు ముందుకు సాగలేదు. కాంగ్రెస్ మిర్యాలగూడ, హైదరాబాద్ నగరంలో ఒక సీటు ఇచ్చేందుకు సిద్ధమయింది. అయితే సీపీఎం ఇందుకు అంగీకరించలేదు. తమకు బలమున్న స్థానాల్లో సీట్లు కేటాయించాలని కోరినా కాంగ్రెస్ నుంచి స్పందన రాకపోవడంతో ఒంటరిగా పోటీ చేయాలని డిసైడ్ అయింది. సీపీఐతో కలసి సీపీఎం పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Next Story