Mon Dec 23 2024 05:25:02 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కేసీఆర్ తో సీపీఎం నేతల భేటీ
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సీపీఎం నేతలు భేటీ కానున్నారు. కేసీఆర్ వారిని ప్రగతి భవన్ కు రావాలని ఆహ్వానించారు.
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సీపీఎం నేతలు భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని ప్రగతి భవన్ కు రావాలని ఆహ్వానించారు. ఈరోజు సాయంత్రం సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు ప్రగతి భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవనున్నారు.
మునుగోడు ఉప ఎన్నికపై....
నిన్న సీపీఎం రాష్ట్ర కమిటీ మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక వరకే తమ మద్దతు ఉంటుందని, యధాతధంగా ప్రభుత్వ విధానాలపై తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికతో పాటు, జాతీయ రాజకీయాలపై కూడా కేసీఆర్ సీపీఎం నేతలతో చర్చించనున్నట్లు సమాచారం.
Next Story