Mon Dec 23 2024 05:31:48 GMT+0000 (Coordinated Universal Time)
ఎంపీ కేకే కుమారులపై క్రిమినల్ కేసు
కేకే కుమారులైన విప్లవ్ కుమార్, వెంకటేశ్వరరావులు ఎన్ఆర్ఐ మహిళకు చెందిన స్థలాన్ని ఆక్రమించారని బాధిత మహిళ బంజారాహిల్స్..
బీఆర్ఎస్ ఎంపీ కేకే కుమారులపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఫోర్జరీ సంతకాలతో ఎన్ఆర్ఐ మహిళకు చెందిన స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో కాజేశారంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఎంపీ కేకే కుమారులైన విప్లవ్ కుమార్, వెంకటేశ్వరరావు లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. నెలరోజుల క్రితమే కేసులు నమోదు చేసినా.. అవి బయటపడకుండా పోలీసులు జాగ్రత్త పడినట్లు సమాచారం.
కేకే కుమారులైన విప్లవ్ కుమార్, వెంకటేశ్వరరావులు ఎన్ఆర్ఐ మహిళకు చెందిన స్థలాన్ని ఆక్రమించారని బాధిత మహిళ బంజారాహిల్స్ పోలీసుల్ని ఆశ్రయించింది. ఆ తర్వాత ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కానీ.. ఈ కేసు వ్యవహారం ఎంపీ కేకే కు సంబంధించినది కావడంతో పాటు, బాధితురాలు ఎన్ఆర్ఐ కావడంతోనే పోలీసులు ఈ కేసు విషయం బయటకు రాకుండా గోప్యత పాటించినట్లు తెలుస్తోంది. నెలరోజుల క్రితమే క్రిమినల్ యాక్ట్ ప్రకారం ఇద్దరిపై కేసులు నమోదు చేసి, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story