Mon Dec 23 2024 09:36:57 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త చట్టం వచ్చిన తర్వాత తొలి కేసు బీఆర్ఎస్ ఎమ్మెల్యేపైనే
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదయింది
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదయింది. నిన్న నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశంల్ పాడి కౌశిక్ రెడ్డి అధికారుల విధులకు ఆటంకం కలిగించారని జడ్పీ సీఈవో ఇచ్చిన ఫిర్యాదుతో కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. కొత్తగా అమలులోకి వచ్చిన చట్టం కింద తొలి కేసు నమోదయిన ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి రికార్డులకు ఎక్కారు.
క్రిమినల్ కేసును...
కౌశిక్ రెడ్డిపై సెక్షన్ 122, 126(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళుతున్నారంటూ పాడి కౌశిక్ రెడ్డి నిన్న జరిగిన జడ్పీ సమావేశంలో అధికారులను అడ్డుకున్నారు. దీంతో అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదయింది. క్రిమినల్ కేసును పోలీసులు నమోదు చేశారు.
Next Story