Thu Dec 19 2024 15:12:07 GMT+0000 (Coordinated Universal Time)
ACB Case : ఏసీబీ నెక్ట్స్ స్టెప్ ఏంటి? అరెస్టా? విచారణా?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏసీబీ కేసు నమోదు చేసింది
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కూడా అవినతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు అయ్యాయి. అయితే ఇప్పుడు ఏసీబీ అధికారులు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. తొలుత కేటీఆర్ ను విచారణకు పిలుస్తారా? లేక తమ దర్యాప్తులో తేలిందని నేరుగా అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటిస్తారా? అని సోషల్ మీడియాలో అనేక రకాల ప్రశ్నలు కనిపిస్తున్నాయి. అయితే కేటీఆర్ పై ఏసీబీ అధికారులు క్రిమినల్ కేసులతో పాటు నాన్ బెయిల్ బుల్ కేసులను ఏసీబీ నమోదు చేయడం ఇప్పుడు పార్టీలోనూ, రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో ఏసీబీ అధికారులు ప్రాధమిక విచారణ పూర్తి చేశారు.
నాన్ బెయిల్ బుల్ కేసులు కావడంతో...
ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటు ప్రైవేట్ కంపెనీ సీఈవో బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసు నమోదు అయింది. ఈ కేసులో ఏ వన్ నిందితుడి గా కేటీఆర్ గా ఉండటం, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగం మోపడంతో ఆయనను తొలుత ఏసీబీ అధికారులు విచారణకు పిలవనున్నారు. విచారణ నాలుగైదు రోజులు పాటు జరుగుతుందా? లేక రేపు శుక్రవారం కావడంతో కేసులో విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది. కేటీఆర్‌పై నాలుగు సెక్షన్ల కింద ఏసీబీ అధికారులు నమోదు చేయడంతో పాటు 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్, 409, 120B కింద కేసు నమోదు చేశారు. ఈ రోజు నోటీసులు ఇచ్చి రేుపు విచారణకు పిలిపించి ఏసీబీ అధికారులు అదుపులో తీసుకుంటారన్న ప్రచారమూ జోరుగా సాగుతుంది.
వరస సెలవులు కావడంతో...
శుక్రవారం కావడంతో పాటు వరసగా ఇక క్రిస్మస్ సెలవులు కూడా న్యాయస్థానాలకు ఉండటంతో ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలు కూడా లేవని కొందరు చెబుతున్నారు.ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ హెచ్ఎండీఏ నుంచి యాభై రెండు కోట్ల రూపాయల నిధులను కంపెనీకి విడుదల చేశారని, దీనిపై తొలుత విచారణకు పిలుస్తారని అంటున్నారు. ఈ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో పూర్తి బాధ్యత తనదేనంటూ గతంలోనే కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నిధులు విడుదల చేయడానికి మంత్రివర్గం ఆమోదం అవసరం లేదని కూడా ఆయన అన్నారు. తాను అరెస్ట్ కావడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ చెబుతూ వస్తున్నారు. తనపై నమోదయిన కేసులను న్యాయపరంగా మాత్రమే ఎదుర్కొంటానని, జైల్లో పెడితే ఫిట్ గా మారి బయటకు వస్తానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలుకూడా ఈ సందర్భంగా చర్చకు వస్తుంది. మరోవైపు ఈకేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఈ కేసులో పూర్తిస్థాయివిచారణ జరిపి, అన్ని ఆధారాలను సేకరించిన తర్వాత మాత్రమే ఏసీబీ అధికారులు యాక్షన్ కు దిగే అవకాశముందనికూడా చెబుతున్నారు. మొత్తం మీద ఈ కేసు వ్యవహారంతో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారనున్నాయి.
Next Story