బహిరంగ సభలో సోనియా ఈ హామీలు ఇవ్వనున్నారా?
తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైంది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరం సందడి నెలకొంది...
తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైంది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరం సందడి నెలకొంది. అటు బీజేపీ సభ, ఇటు కాంగ్రెస్ బహిరంగ సభలతో రాజకీయ సందడి నెలకొంది. ముందు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో వివిధ పార్టీలు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. ఈరోజు తెలంగాణలో భారత్లో విలీనమైన సందర్భాన్ని పురస్కరించుకొని.. కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లాలో విజయభేరీ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే సహా పలువురు నాయకులు హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ బహిరంగ సభను ఏకంగా 10 లక్షల మందితో నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ భారీ ప్లాన్ చేసింది. అయితే ఈ సభలోనే కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలోని కీలక అంశాలను ప్రకటించనుంది. దీంతో పార్టీ ఏ ఏ హామీలు ఇవ్వనుందనే దానిపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ అగ్రనేతలు.. ఆరు హామీలపై ఆరు గ్యారెంటీ కార్డులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే నిన్న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు సోనియాగాంధీ. అందరు కలిసికట్టుగా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.