Mon Dec 23 2024 10:31:58 GMT+0000 (Coordinated Universal Time)
మల్లురవికి నోటీసులు.. ఈ నెల 12న?
కాంగ్రెస్ నేత మల్లు రవికి సైబర్ క్రైం పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41 ఏ సీఆర్పీసీ కింద ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి
కాంగ్రెస్ నేత మల్లు రవికి సైబర్ క్రైం పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41 ఏ సీఆర్పీసీ కింద ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. ఈనెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలని మల్లురవిని నోటీసుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ వార్ రూంపై పోలీసులు దాడి చేసిన సమయంలో వార్ రూమ్ కు తానే ఇన్ఛార్జినని మల్లు రవి తెలిపారు. కాంగ్రెస్ వార్ రూమ్ లో కేవలం వ్యూహాలు మాత్రమే రూపొందించుకుంటామని ఆయన పోలీసులకు చెప్పారు. వారితో వాగ్వాదానికి కూడా దిగారు.
కాంగ్రెస్ వార్ రూంలో...
ఈ నేపథ్యంలో వార్ రూంలో ఏం జరుగుతంది? ఏయే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న దానిపై విచారించేందుకు సైబర్ క్రైం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు విచారణకు హాజరయ్యారు. ఆయన చెప్పిన వివరాలను బేస్ చేసుకుని పోలీసులు మల్లురవికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన విచారణలో సునీల్ కనుగోలు పలు విషయాలను పోలీసులకు వివరించినట్లు చెబుతున్నారు.
Next Story