Sun Dec 22 2024 23:58:36 GMT+0000 (Coordinated Universal Time)
Y, Y+ కేటగిరీలతో రక్షణ ఉంటుందనుకోవడం అవివేకం : దానం నాగేందర్
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు వై కేటగిరీ భద్రతనిస్తున్నట్లు సోమవారం ఉదయం కేంద్రం తెలిపింది. దాంతో ఇద్దరి..
తెలంగాణలో తమకు ప్రాణహాని ఉందన్న ఇద్దరు బీజేపీ నేతలకు కేంద్రం భద్రతను పెంచింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కు వై ప్లస్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు వై కేటగిరీ భద్రతనిస్తున్నట్లు సోమవారం ఉదయం కేంద్రం తెలిపింది. దాంతో ఇద్దరి కాన్వాయ్ లలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వచ్చి చేరనున్నాయి. ఈటలకు 11 మందితో కూడిన సీఆర్పీఎఫ్ సిబ్బంది రక్షణ కల్పించనుండగా.. అర్వింద్ కు 8 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు రక్షణ కల్పించనున్నాయి. కాగా.. ఇప్పటికే ఈటలకు రాష్ట్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రతను కల్పించిన విషయం తెలిసిందే.
ఈటల, అర్వింద్ లకు కేంద్రం సెక్యూరిటీ కల్పించిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనానికి దారితీశాయి. ఆత్మగౌరవానికి కేంద్రం గౌరవమిస్తే చాలన్న ఆయన.. వై, వై ప్లస్ కేటగిరీలతో రక్షణ వస్తుందనుకోవడం భ్రమే అవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇచ్చే సెక్యూరిటీతో వచ్చేదేం లేదని, సెక్యూరిటీ అంత పటిష్టంగా ఉంటే.. ఆపద రాదు అంటే.. ఇందిరాగాంధీ చనిపోయేవారా ? అని ప్రశ్నించారు. సెక్యూరిటీ ఉన్నా చాలామంది నేతలు చనిపోయారన్నారు. పోలీసులు, పోలీసు బలగాల మధ్యలో ఉంటే రక్షణ ఉంటుందనుకుంటే అది ముమ్మాటికీ అవివేకమే అవుతుందన్నారు.
Next Story