Sat Dec 28 2024 05:59:33 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : తెలంగాణలో మోదీ ప్రచారం షెడ్యూల్ ఇదే
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం తేదీలు ఖరారయ్యాయి.
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం తేదీలు ఖరారయ్యాయి. లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తెలంగాణలో ప్రధాని పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 30వ తేదీ, వచ్చే నెల 3,4 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించి లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెబుతున్నారు. నారాయణపేట్, చేవెళ్ల సభల్లో ఆయన ప్రసంగించనున్నారు.
మూడు రోజుల పాటు...
ఈనెల 30న జహీరాబాద్ లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం శేరిలింగంపల్లిలో ఐటీ కంపెనీ ఉద్యోగులతో ప్రధాని సమావేశమవుతారు. వచ్చే నెల 3వ తేదీన వరంగల్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో అత్యధిక స్థానాలను సాధించే దిశగా మోదీ పర్యటించనున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో ప్రజలను ఆకట్టుకోనున్నారు.
Next Story