Mon Dec 23 2024 11:42:26 GMT+0000 (Coordinated Universal Time)
తప్పుడు సమాచారాన్ని పసిగట్టండి.. నైపుణ్యం పెంచుకోండి
తప్పుడు సమాచారం ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని యూఎస్ కాన్సులేట్ జనరల్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ డేవిడ్ మోయర్ అన్నారు.
తప్పుడు సమాచారం ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారిందని యూఎస్ కాన్సులేట్ జనరల్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ డేవిడ్ మోయర్ అన్నారు. అందిన సమాచారం అధారంగా ప్రజలు అభిప్రాయాలను తెలుసుకుని మీడియా ప్రసారం చేస్తుందన్నారు. వాస్తవ సమాచారాన్ని ప్రజలకు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పుడు సమాచారం, నకిలీ వార్తల గుర్తింపు కోసం జర్నలిస్టులు వినియోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానం గురించి యూఎస్ కాన్సులేట్ జనరల్, ఉస్మానియా జర్నలిజం విభాగం కలసి ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు.
తేడాను గుర్తించి...
కొన్ని సందర్భాల్లో మాత్రమే దురదృష్టవశాత్తు మీడియా సంస్థలు తప్పుడు సమాచారాన్ని అందిస్తాయన్నారు. ఆ సమయంలో జర్నలిస్లులు ఒక్కోసారి అబద్ధానికి వాస్తవానికి తేడాను గుర్తించలేకపోతున్నారని డేవిడ్ మోయర్ అభిప్రాయపడ్దారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని నిరోధించవచ్చని తెలిపారు. తప్పుడు సమాచారాన్ని తెలుసుకోవడంపై స్కిల్స్ ను అందించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ ముందుకు రావడం మంచి పరిణామమన్నారు. ఓయూ జర్నలిజం విభాగం ఆయన అభినందించారు.
తప్పుడు సమాచారాన్ని పసిగట్టేందుకు..
ఒత్తిడిలో తప్పుుడు సమాచారాన్ని అందించవద్దని, దానిని ఎదుర్కొనేందుకు అవసరమైన నైపుణ్యాన్ని సంపాదించుకోవాలని ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. అక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, ఇందుకు ఓయూ జర్నలిజం విభాగం ఎప్పుడూ ముందు ఉంటుందని ఆయన తెలిపారు. సమాచారాన్ని జల్లెడ పట్టి వాస్తవ సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు సరైన ఆలోచనలతో ముందుకు వెళ్లాలని డేటాలీడ్స్ వ్యవస్థాపకుడు సయ్యద్ నజాకత్ అన్నారు. టెక్నికల్ టూల్స్ పై అతిగా ఆధారపడే కన్నా పరిశీలన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటం మంచిదని బూమ్ లైవ్ దక్షిణాది న్యూస్ ఎడిటర్ నివేదిత నిరంజన్ కుమార్ సూచించారు. వాస్తవం, అవాస్తవాలను గుర్తించాలని కోరారు.
సదస్సులో....
ఈ సదస్సులో ఉస్మానియా యూనివర్సిటీ సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ కె. నరెందర్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ కె. స్టీవెన్ సన్, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ లు ప్రసంగించారు. ప్రముఖ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి, ప్యాక్ట్ చెకర్ సత్యప్రియ రచించిన ప్యాక్ట్ చెకింగ్ పుస్తకాన్ని డేవిడ్ మోయర్ తో కలిసి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ విడుదల చేశారు. 90 గంటల శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ జాతీయ సదస్సుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జర్నలిస్టులు, యూట్యూబర్స్, ఫ్రీలాన్సర్స్ పాల్గొన్నారు. ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్లు ఉడుముల సుధాకర్ రెడ్డి, కొరీనా సురేస్, ప్రాజెక్ట్ సభ్యుడు ఎస్. రాము, యూఎస్ కాన్సులేట్ నుండి అబ్దుల్ బాసిత్ తదితరులు పాల్గొన్నారు.
Next Story