సీఎం దావోస్ స్వాగతంలో ఇద్దరు జగిత్యాల వాసుల ప్రముఖపాత్ర
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ (ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సమావేశం) లో పాల్గొనడానికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఈనెల 15న జ్యురిక్ విమానాశ్రయానికి చేరిన సందర్బంగా స్విట్జర్లాండ్ లోని తెలుగు ప్రవాసులు ఘన స్వాగతం పలికారు
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ (ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సమావేశం) లో పాల్గొనడానికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఈనెల 15న జ్యురిక్ విమానాశ్రయానికి చేరిన సందర్బంగా స్విట్జర్లాండ్ లోని తెలుగు ప్రవాసులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రప్రథమ అధికారిక విదేశీ పర్యటన స్వాగత కార్యక్రమంలో జగిత్యాలకు చెందిన ఇద్దరు ప్రముఖులు మహ్మద్ ఇమ్రాన్, మంద భీంరెడ్డి లు కీలకపాత్ర పోషించారు. ఇంటా బయటా ఒకే ఊరివారు అవకాశం వస్తే తమ ఆదరాభిమానాలు ప్రదర్శించి సమన్వయంతో పనిచేస్తారు అనేదానికి ఈకార్యక్రమం నిదర్శనం.
ప్రపంచంలో ముఖ్యమైన ఆర్ధిక కేంద్రంగా భావించే స్విట్జర్లాండ్ లో గత 20 ఏళ్లుగా నివసిస్తున్న మహ్మద్ ఇమ్రాన్ ది జగిత్యాల పట్టణం ఖిలాగడ్డ. ఒక బహుళజాతి సంస్థలో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్న ఇమ్రాన్ జ్యురిక్ లోని తెలుగు ప్రముఖులలో ఒకరు. స్థానిక స్విస్ తెలుగు ప్రవాసులతో అనుసంధానం చేస్తూ సీఎం స్వాగత కార్యక్రమం విజయవంతానికి ఆయన కృషి చేశారు.
జగిత్యాలకు సమీపంలోని నాగునూరు - లచ్చక్కపేట కు చెందిన వలస వ్యవహారాల విశ్లేషకులు, టిపిసిసి ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి ముఖ్యమంత్రి ప్రయాణించిన విమానంలోనే ఢిల్లీ నుంచి జ్యురిక్ కు వెళ్ళి అక్కడి ప్రవాసీయులతో కలిసి సమన్వయం చేయడంతో స్వాగత కార్యక్రమం విజయవంతమైంది.
స్విట్జర్లాండ్ లోని జెనీవాలో లో జరుగనన్న ఒక అంతర్జాతీయ సదస్సులో పాల్గోనడానికి భీంరెడ్డి అక్కడికి వెళ్ళారు. ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్ డా. బి.ఎం. వినోద్ కుమార్ ల ప్రోత్సాహం మేరకు తాను రేవంత్ రెడ్డి స్వాగత కార్యక్రమాన్ని సమన్వయం చేసినట్లు ఆయన తెలిపారు.