Mon Dec 23 2024 11:47:25 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడులో ఆ కుటుంబాలు ఒక్కొక్కరికీ...?
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరోసారి వివాదంగా మారే అవకాశముంది
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరోసారి వివాదంగా మారే అవకాశముంది. లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మునుగోడు నియోజవర్గంలోని 5,800 గొల్ల కురుమల కుటుంబాలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేసింది. ఒక్కొక్కరి ఖాతాల్లో 1.58 లక్షల రూపాయల నిధులను జమ చేసింది. ఈ సొమ్ముతో గొర్రెలను కొనుగోలు చేయాలని తెలిపింది. గతంలో గొర్రెలను నేరుగా పంపిణీ చేసిన ప్రభుత్వం ఈసారి ప్రయోగాత్మకంగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసింది.
కోడ్ కంటే ముందుగానే...
అయితే లబ్దిదారులు ఎవరైనా 20 గొర్రెలను ముందుగా కొనుగోలు చేసి చూపితేనే బ్యాంకుల నుంచి సొమ్ములు విత్ డ్రా చేసుకునే అవకాశముంటుంది. ఒక్కొక్క యూనిట్ 1.58 లక్షలు కావడంతో ఖచ్చితంగా కొనుగోలు చేసిన గొర్రెలను చూపాలన్న షరతు విధించారు. గత నెల 30వ తేదీన ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని తెలిసింది. కొందరు లబ్దిదారులు ఇప్పటికే నగదును వివిధ రూపాల్లో డబ్బులు డ్రా చేయడంతో బ్యాంకు అధికారులు అభ్యంతరం తెలిపారు. మునుగోడు నియోజకవర్గానికి 93.78 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఎన్నికల కోడ్ రాకముందే నగదు బదిలీ పూర్తికావడంతో ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కోసమే ఈ విధంగా ప్రభుత్వం జమ చేసిందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
Next Story