Sun Dec 22 2024 16:13:52 GMT+0000 (Coordinated Universal Time)
నాంపల్లి కోర్టుకు నాగార్జున
హీరో నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసులో నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది
హీరో నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసులో నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. రేపు నాగార్జున కోర్టుకు హాజరు కానున్నారు. నాగార్జునతో పాటు సాక్షులను కూడా విచారించాలని కోర్టు నిర్ణయించింది. ఈమేరకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాగార్జున రేపు కోర్టుకు హాజరు కావాలని పేర్కొంది.
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు...
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబ గౌరవాన్ని కించపర్చాయని, తమ పరువుకు నష్టం కలిగించిందంటూ నాగార్జున కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం రేపు సాక్షులను విచారించాలని ఆదేశించింది. విచారణను రేపటికి వాయిదా వేసింది.
Next Story