Mon Dec 23 2024 23:07:11 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు తెలంగాణకు రాజ్‌నాథ్ సింగ్ రాక
ఈరోజు తెలంగాణకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రానున్నారు. వీఎల్ఎఫ్ స్టేషన్ ను ఆయన ప్రారంభించనున్నారు.
ఈరోజు తెలంగాణకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రానున్నారు. రంగారెడ్డి జిల్లా పూడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వీఎల్ఎఫ్ స్టేషన్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ లో 1174హెక్టార్ల భూమిలో ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది.
రెండు పార్టీలూ...
డిసెంబరు 2017లో జీవో కూడా విడుదల చేసింది. ఇప్పుడు దానిని రాజ్‌నాధ్ సింగ్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా పాల్గొననున్నారు. అయితే దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటుపై పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వం జీవో జారీ చేసిందని కాంగ్రెస్, ఈ ప్రభుత్వమే రాడార్ వ్యవస్థను కాంగ్రెస్ ను కొని తెచ్చుకుంటుందని బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. ఈరోజు మాత్రం రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఈ రాడార్ స్టేషన్ ను ప్రారంభించనున్నారు.
Next Story