Mon Dec 23 2024 08:24:37 GMT+0000 (Coordinated Universal Time)
లెక్చరర్ దాష్టీకానికి రెండుకాళ్లు కోల్పోయిన విద్యార్థిని
బీకాం ఆఖరి సంవత్సరం చదువుతున్న నిహారిక.. జ్వరం కారణంగా ఈనెల 22న సెలవు తీసుకుని ఇంటికెళ్లింది. జ్వరం తగ్గాక తిరిగి..
పాఠశాలకు, కాలేజీకి వచ్చే విద్యార్థులకు పాఠాలు చెప్పి.. వారి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులు వారిపాలిట శాపాలుగా మారుతున్నారు. తల్లి-తండ్రి తర్వాత వారి జీవితాలకు భరోసా ఇవ్వాల్సిన లెక్చరర్ ఓ విద్యార్థిని పట్ల అమానవీయంగా ప్రవర్తించి.. ఆమెకు భవిష్యత్ లేకుండా చేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సాంఘిక గురుకుల కళాశాలలో చోటుచేసుకుంది. ఆరోగ్యం బాలేకపోవడంతో రెండ్రోజులు సెలవు పెట్టి, ఇంటికెళ్లొచ్చిన విద్యార్థినిని రోజుకు 8 గంటల చొప్పున ఐదురోజులు బయటే నిలబెట్టడంతో ఆమె కాళ్లు చచ్చుబడిపోయాయి.
బీకాం ఆఖరి సంవత్సరం చదువుతున్న నిహారిక.. జ్వరం కారణంగా ఈనెల 22న సెలవు తీసుకుని ఇంటికెళ్లింది. జ్వరం తగ్గాక తిరిగి కళాశాలకు వచ్చింది. కానీ.. సమయానికి కాలేజీకి రాలేదన్న సాకు చూపి లెక్చరర్ ఆమెపట్ల దారుణంగా ప్రవర్తించాడు. కామర్స్ లెక్చరర్ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఐదురోజులపాటు తరగతి బయటే నిలబెట్టి తన పైశాచికత్వాన్ని చూపించాడు. ఎక్కువ సమయం నిలబడటం వల్ల నిహారిక కాళ్లకు రక్తప్రసరణ నిలిచిపోయి.. కుప్పకూలిపోయింది. తోటి విద్యార్థినులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు ఆమె కాళ్లు చచ్చుబడిపోయాయని తెలిపారు.
ఈ ఘటన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి దృష్టికి వెళ్లగా.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సంబంధిత లెక్చరర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. విద్యార్థిని కాళ్లు చచ్చుబడిపోవడానికి కారకుడైన లెక్చరర్ ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అలాగే కళాశాల ప్రిన్సిపల్ కల్యాణి పై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. కాగా.. నిహారిక అనారోగ్యానికి కారణమైన లెక్చరర్ పై ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story