Fri Dec 20 2024 07:56:06 GMT+0000 (Coordinated Universal Time)
బండి అరెస్ట్‌పై ఢిల్లీ పెద్దల ఆరా
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్కక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌పై ఢిల్లీ పెద్దలు ఆరా తీశారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్కక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌పై ఢిల్లీ పెద్దలు ఆరా తీశారు. అర్థరాత్రి అరెస్ట్ చేయడంపై ఢిల్లీ పెద్దలు ఫోన్లు చేసి స్థానిక నేతలను వివరాలను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న బండి సంజయ్‌పై కేంద్రహోమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఇక్కడ న్యాయవాది రామచంద్రరావుతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది.
న్యాయ సహకారం...
ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుల్లో బండి సంజయ్ ప్రమేయం ఎందుకుందని ప్రభుత్వం ఆరోపిస్తుంది? అందుకు గల కారణాలను కూడా వారు అడిగి తెలుసుకున్నారని చెబుతున్నారు. అవసరమైన న్యాయ సహకారం వెంటనే బండి సంజయ్‌కు అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. సంజయ్ అక్రమ అరెస్ట్‌పై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపైనా కూడా ఢిల్లీ పెద్దల నుంచి ఇక్కడ రాష్ట్ర నేతలకు కొన్ని సూచనలు అందినట్లు చెబుతున్నారు.
Next Story