Sun Dec 29 2024 09:47:24 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ పథకాలు భేష్ : కేజ్రీవాల్
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అన్నారు
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ లో జరిగిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కంటి వెలుగు, సాగునీటిరంగంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న పద్ధతులు బాగా ఉన్నాయని ప్రశంసించారు. ఐ క్యాంప్ సందర్శనకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తే వెళ్ళాననని ఆయన చెప్పారు.
కంటి వెలుగు....
తెలంగాణలో 3 నుంచి 4 కోట్ల జనాభా ఉందని, అక్కడ ఉన్న ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఉచితంగా కళ్లద్దాల పంపిణీ, కంటి ఆపరేషన్లు చేయిస్తున్నారని కొనియాడారు. కంటి వెలుగు కార్యక్రమం అక్కడి పేదలకు ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి కార్యక్రమాలను చూసి నేర్చుకోవాలని, తాము కూడా ఢిల్లీలో, పంజాబ్ లోనూ అమలు చేస్తామని చెప్పారు.
Next Story