Sun Dec 22 2024 19:36:06 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రేవంత్ కు ఢిల్లీ పోలీసులు నోటీసులు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడమే కాకుండా, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే కారణంతోనే రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు నలుగురు కాంగ్రెస్ నేతలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి.
రేపు విచారణకు...
మే 1వ తేదీన తమ ఎదుట ఫోన్ తో పాటు హాజరై విచారణకు సహకరించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మే 1వ తేదీ ఉదయం పది గంటలకు ఢిల్లీలోని సెక్టార్ లోని పోలీస్ ప్రత్యేక విభాగంలో హాజరు కావాలని కోరారు. నోటీసుల్లో పేర్కొన్నట్లు విచారణకు హాజరు కాకుంటే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. దీనికి సంబంధించి రేవంత్ విచారణకు హాజరవుతారా? లేదా? అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆయన న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిసింది.
Next Story