Sun Dec 22 2024 23:50:56 GMT+0000 (Coordinated Universal Time)
Big Breaking : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు కస్టడీ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు న్యాయమూర్తి నాగపాల్ కస్టడీ విధించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు న్యాయమూర్తి కస్టడీ విధించారు. ఈరోజు ఆమెను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిన్న అరెస్టయిన కవితకు ఈరోజు వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టుకు హాజరు పర్చారు. న్యాయమూర్తి నాగ్ పాల్ ఎదుట కవితను హాజరుపర్చగా ఆమెకు కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తరలించారు. కల్వకుంట్ల కవితకు ఏడు రోజుల కస్టడీకి విధించారు. ఈ నెల ఇరవై మూడో తేదీన ఆమెను కోర్టులో హాజరు పర్చాలని పేర్కొంది. రోజులో ఒకసారి కుటుంబ సభ్యులను కలిసేందుకు, తన న్యాయవాదులను కలిసేందుకు, వినియోగించే మందులు, భోజనం ఇంటి నుంచి తెప్పించుకునేందుకు కోర్టు అనుమతించింది.
కస్టడీకి ఇవ్వాలంటూ...
నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో ఐదు గంటల పాటు సోదాలు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. రాత్రి 8.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆమెను ఢిల్లీకి తరలించారు. రాత్రి ఆమెను ఈడీ కార్యాలయంలోనే ఉంచారు. కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి విచారించాలని, కవితను కస్టడీకి అప్పగించాలంటూ ఈడీ తరుపున న్యాయవాదులు పిటీషన్ వేశారు. కవితను పది రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ పిటీషన్ వేసింది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని కవిత ఆరోపిస్తున్నారు. త్వరలోనే బయటకు వస్తానని ఆమె కోర్టు ప్రాంగణంలో చెప్పారు. న్యాయపరంగా ఎదుర్కొంటానని ఆమె అన్నారు.
అమిత్ అరోరా వాంగ్మూలం ఆధారంగా...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా కల్వకుంట్ల కవిత పేరును ఇటీవల సీబీఐ చేర్చింది. కవిత ప్రమేయంతోనే ఈ స్కామ్ జరిగిందని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. అమిత్ అరోరా ఇచ్చిన సమాచారం మేరకు కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. అమిత్ అరోరాను గత నాలుగు రోజులుగా ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు ఆయన ఇచ్చిన సమాచారంతోనే అరెస్ట్ చేశారంటున్నారు. దీంతో కవిత ఇంట్లో సోదాలు చేసి నిన్న అరెస్ట్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. కవితను కోర్టులో హాజరుపర్చిన సందర్భంగా కోర్టు బయట భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నెల ఇరవై మూడో తేదీ వరకూ ఈడీ కస్టడీకి కవితను ఇచ్చారు
Next Story