Sun Dec 22 2024 21:18:43 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : వామ్మో పది రోజుల్లో ఇన్ని డెంగీ కేసులా? తెలంగాణకు వైరల్ ఫీవర్
తెలంగాణలో డెంగీ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. డెంగీ కేసులతో పాటు వైరల్ ఫీవర్ కూడా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి
తెలంగాణలో డెంగ్యూకేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. డెంగ్యూ కేసులతో పాటు వైరల్ ఫీవర్ తో ప్రజలు ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో రోజుకు వెయ్యి మంది వరకూ అవుట్ పేషెంట్ విభాగానికి వస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రికి కూడా ఇదేరకంగా పేషెంట్లు వస్తున్నారు. ఫీవర్ ఆసుపత్రి కూడా రోగులతో కిటకిటలాడుతుంది. ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగడంతో వైద్యుల కొరతతో కొంత ఇబ్బందులు తలెత్తున్నాయి.
భారీ సంఖ్యలో....
తెలంగాణలో పది రోజుల్లో డెంగ్యూ కేసులు భారీగా నమోదయ్యాయి. డెంగ్యూ ఎఫెక్ట్ తో ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్ ల కొరత ఏర్పడింది. ప్రైవేట్ ఆస్పత్రులలో కూడా రోగులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఇవి లెక్కకురావడం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,847 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. అత్యధికంగా హైదరాబాద్లో 1101 కేసులు నమోదయినట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాలో 287, మేడ్చల్ జిల్లాలో 268, సూర్యాపేట జిల్లాలో లో 217 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో 6,500 టైఫాయిడ్,140 మలేరియా కేసులు నమోదైనట్లు అధికారుల దృవీకరించారు.
Next Story