Fri Mar 14 2025 09:53:22 GMT+0000 (Coordinated Universal Time)
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క
డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు.

డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేనో తేదీ నాటికి చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మూడో విడత రుణమాఫీ ఆగస్టు పదిహేనో తేది నాటికి చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకూ రెండు విడతలుగా రైతు రుణమాఫీ చేశామన్నారు.
ఆగస్టు 15వ తేదీన...
ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని భట్టి విక్రమార్క అన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం సక్సెస్ ఫుల్ గా చేసిందన్నారు. ఇప్పటి వరకూ రుణమాఫీ కారణంగా 5,45,407 మంది రైతులు లబ్ది పొందారని భట్టి విక్రమార్క తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజలకు దగ్గరగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమేనని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
Next Story