Mon Dec 23 2024 13:19:11 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్
ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలుత 20 నుంచి 25 అసెంబ్లీ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ స్కూల్స్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. దేశానికే యంగ్ ఇండియా స్కిల్స్ రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. దసరా పండగ కంటే ముందుగానే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు భూమి పూజ చేస్తామని తెలిపారు.
యంగ్ ఇండియా....
ఇందుకోసం యంగ్ ఇండియా మోడల్ స్కూల్స్ నమూనాను ఆయన విడుదల చేశారు. గురుకుల, రెసిడెన్షియల్ పాఠశాలలకు పెద్దయెత్తున నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. పేద, బడుగు వర్గాలకు ఉచిత నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.
Next Story