Mon Dec 23 2024 14:03:08 GMT+0000 (Coordinated Universal Time)
బాచుపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు
ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు,కమీషనర్ రామకృష్ణ రావు గారు,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి గారు, గౌరవ ప్రజాప్రతినిధులతో 1వ డివిజన్ పరిధిలో ప్రగతి యాత్ర లో
ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు,కమీషనర్ రామకృష్ణ రావు గారు,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి గారు, గౌరవ ప్రజాప్రతినిధులతో 1వ డివిజన్ పరిధిలో ప్రగతి యాత్ర లో భాగంగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి విజయలక్ష్మి సుబ్బారావు గారితో,సీనియర్ నాయకులు సుబ్బారావు గారితో,స్థానిక డివిజన్ వాసులతో కలిసి పాద యాత్ర నిర్వహించడం జరిగింది.
ఇందులో భాగంగా క్రాంతి నగర్ కాలనీలో 47.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభోత్సవం,20 లక్షల వ్యయంతో క్రాంతి నగర్ కాలనీ పార్క్ లో చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ ప్రారంభోత్సవం,క్రాంతి నగర్ రోడ్ నె.8 లో 80 లక్షల వ్యయంతో 900 ఎంఎం డయా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ నిర్మాణ పనులు ప్రారంభోత్సవం,24 లక్షల వ్యయంతో కేఆర్సిఆర్ కాలనీ లో సెంట్రల్ లైటినింగ్ ప్రారంభోత్సవం,
కేఆర్సిఆర్ కాలనీ రోడ్ నె.6 లో 40 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన,75లక్షల వ్యయంతో ప్రణీత్ ప్రణవ్ అంటిల్లా నుండి మొండికుంట వరకు స్ట్రామ్ వాటర్ లైన్ నిర్మాణ పనులు ప్రారంభోత్సవం,71 లక్షల వ్యయంతో కేఆర్సిఆర్ కాలనీ బొంగులకుంట పార్క్ లో పలు అభివృద్ధి పనులు(స్టోన్ పిట్చింగ్, లైట్నింగ్ ,కాంపౌండ్ వాల్)ప్రారంభోత్సవం,1 కోటి 5 లక్షల వ్యయంతో దయ్యాలకుంట పార్క్ వద్ద కాంపౌండ్ వాల్ నిర్మాణం,మరియు ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ ప్లే అరీనా ప్రారంభోత్సవం,12 లక్షల వ్యయంతో రెయిన్బో కాలనీ లో సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభోత్సవం,బ్లాక్ డైమండ్ లేఔట్ గోతిక్ ప్రైడ్ వద్ద 50 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం,వంటి పలు నిర్మాణ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహిచారు. ఈ కార్యక్రమంలో గౌరవ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,NMC బిఆర్ఎస్ అధ్యక్షులు,ఆయా డివిజన్ అధ్యక్షులు మరియు అనుబంధ కమిటీల సభ్యులు సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు,NMC ఆయా విభాగాల అధికారులు, మరియు సిబ్బంది,స్థానిక డివిజన్ ఆయా కాలనీ అసోసియేషన్ సభ్యులు,స్థానిక వాసులు ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
Next Story