Sat Mar 29 2025 19:05:56 GMT+0000 (Coordinated Universal Time)
సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్.. మరోసారి వాయిదా!!
ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పి.శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, మహిపాల్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్ లను ప్రతివాదులుగా చేర్చారు.
ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. స్పీకర్ నుంచి మరింత సమాచారం తీసుకోవడానికి కొంత సమయం కావాలని కోరారు. స్పీకర్ తో చర్చించి కోర్టుకు వివరాలను అందిస్తామని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ ఇప్పటికే 10 నెలలు పూర్తయిందని, ఇంకెంత గడువు కావాలని ప్రశ్నించింది. ముకుల్ రోహత్గి విన్నపంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. కాంగ్రెస్‌లోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనవరిలో ప్రతిపక్ష పార్టీ సుప్రీం కోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి సరైన గడువు ఏమిటని సుప్రీంకోర్టు ఇటీవల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని ప్రశ్నించింది. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ (తెలంగాణ శాసనసభ కార్యదర్శికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు) స్పీకర్‌ను సంప్రదించి ఈ అంశంపై వారి అభిప్రాయాలను తెలియజేయాలని కూడా కోర్టు కోరింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టిక్కెట్‌పై గెలిచిన తర్వాత శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయకుండా మొత్తం 10 మంది పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల వివరాలు ఇవే: దానం నాగేందర్ (ఖైరతాబాద్), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల్), కడియం శ్రీహరి (ఘన్పూర్), తెల్లం వెంకట్ రావు (భద్రాద్రి కొత్తగూడెం), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), కాలె యాదయ్య (చేవెళ్ల), టి.ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్), ఎం. సంజయ్‌పాల్ రెడ్డి (జె.సంజయ్పాల్రెడ్డి) అరెకపూడి గాంధీ (సెరిలింగంపల్లి).
Next Story