Sun Mar 23 2025 22:09:21 GMT+0000 (Coordinated Universal Time)
ఆంగ్ల తెలుగు నిఘంటువుల పంపిణీ చేసిన ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గీత తోమాస్ రెడ్డి చిత్తా దంపతులు
ఆంగ్ల తెలుగు నిఘంటువుల పంపిణీ షాద్ నగర్ సమీపంలోని ఎఫ్. సి. ఎన్. హోమ్ కేంద్రముగా ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ...

ఆంగ్ల తెలుగు నిఘంటువుల పంపిణీ షాద్ నగర్ సమీపంలోని ఎఫ్. సి. ఎన్. హోమ్ కేంద్రముగా ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గీత తోమాస్ రెడ్డి చిత్తా దంపతులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాటిలో భాగంగానే షాద్నగర్ చుట్టుపక్కల ప్రాంతాలలోని ఉన్నత పాఠశాలల్లో 6 నుండి 10వ తరగతి చదువుతున్న 11 వేల మంది విద్యార్థులకు ఉచితంగా ఆంగ్ల, తెలుగు నిఘంటువులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఇంగ్లీషు భాష యొక్క ఆవశ్యకతను గుర్తించి గ్రామీణ ప్రాంత పేద పిల్లలు ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం సాధించాలంటే ఈ నిఘంటువులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రతిరోజు కనీసం ఐదు కొత్త పదాలను నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరై సంస్థ వ్యవస్థాపకులకు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story