Mon Dec 23 2024 01:55:37 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఇంకా సీఎం కేసీఆర్ అట.. విద్యాశాఖ వింత పోకడ.. ప్రభుత్వం సీరియస్
తెలంగాణలో విద్యాశాఖ పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాల పంపిణీ వివాదంగా మారింది.
తెలంగాణలో విద్యాశాఖ పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాల పంపిణీ వివాదంగా మారింది. నిన్నటి నుంచి తెలంగాణలో పాఠశాలలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు విద్యాశాఖ పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసింది. అయితే తెలుగు పాఠ్య పుస్తకంలో ముందుమాటలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేరు, విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి పేర్లను యధాతధంగా ఉంచారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. బాధ్యులు ఎవరన్న దానిపై విచారణ ప్రారంభించింది.
విద్యార్థులకు పంపీణీ చేసిన...
విద్యార్థులకు పంపీణీ చేసిన పాఠ్య పుస్తకాలను కనీసం చూడకుండా పంపిణీ చేయడంపై విద్యాశాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రభుత్వం మారి ఆరు నెలలవుతున్నప్పటికీ ఇప్పటికీ ముందుమాటను మార్చకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలన్నింటినీ వెనక్కు తీసుకోవాలని అన్ని పాఠశాలలకు ఆదేశాలు అందాయి. వెంటనే ఈరోజు విద్యార్థులకు నిన్న పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలను ఈరోజు ఉపాధ్యాయులు వెనక్కు తీసుకుంటున్నారు.
Next Story