మీకు నేర చరిత్ర ఉందా ? బీజేపీ దరఖాస్తులో ప్రత్యేక కాలం
తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేయాలనుకునే ఆశావహుల కోసం బీజేపీ అప్లికేషన్లు జారీ చేసింది. వీటిని సోమవారం (సెప్టెంబరు 4) నుంచి ఈనెల 10 వరకు వాటిని స్వీకరిస్తున్నారు. ఈ దరఖాస్తు ఫారాల్లో బీజేపీ నాయకత్వం అభ్యర్థుల నేర చరిత్రను అడుగుతోంది.
మీకు నేర చరిత్ర ఉందా ?
బీజేపీ దరఖాస్తులో ప్రత్యేక కాలం
తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేయాలనుకునే ఆశావహుల కోసం బీజేపీ అప్లికేషన్లు జారీ చేసింది. వీటిని సోమవారం (సెప్టెంబరు 4) నుంచి ఈనెల 10 వరకు వాటిని స్వీకరిస్తున్నారు. ఈ దరఖాస్తు ఫారాల్లో బీజేపీ నాయకత్వం అభ్యర్థుల నేర చరిత్రను అడుగుతోంది. ఎన్ని కేసులున్నాయో సవివరంగా చెప్పాలని ఆదేశించింది. దరఖాస్తును నాలుగు విభాగాలుగా రూపొందించిన రాష్ట్ర బీజేపీ మొదటి విభాగంలో అభ్యర్థి బయోడేటా, చేసిన రాజకీయ కార్యక్రమాలు, రెండో విభాగంటో గతంలో పోటీచేసిన ఎంపీ, ఎమ్మెల్యే, స్థానిక సంస్థల వివరాలు వాటిలో వచ్చిన ఓట్లను అడుగుతోంది. మూడోది ప్రస్తుతం పార్టీలో నిర్వహిస్తున్న బాధ్యతలను, చివరిగా, క్రిమినల్ కేసులు, శిక్షలు పడిన కేసుల వివరాలను అడుగుతోంది.
అప్లికేషన్లను తీసుకున్న తర్వాత నియోజకవర్గాల వారీగా వచ్చిన అప్లికేషన్లను రాష్ట్రనేతలు పరిశీలిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా పార్టీ సీనియర్లతో కమిటీని వేయనున్నారు. ఆపై నియోజకవర్గానికి ముగ్గురు పేర్లను ఎంపిక చేసి హైకమాండ్ కు పంపుతారు. రంగారెడ్డి, హైదరాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి భారీగా అప్లికేషన్లు వస్తాయని పార్టీ నేతల అంచనా.