Sun Dec 22 2024 21:18:59 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ షర్మిల హెల్త్ బులిటెన్ విడుదల
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. నిన్న తెల్లవారు జామున షర్మిల ఆసుపత్రిలో చేరారని, ఎటువంటి ఆహారం తీసుకోక పోవడంతో బీసీ, బలహీనతతో అడ్మిట్ అయ్యారని వైద్యులు చెప్పారు. షర్మిలకు డీ హైడ్రేషన్, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఉందని చెప్పారు.
విశ్రాంతి అవసరం...
అలాగే వైఎస్ షర్మిలకు తీవ్రమైన ఒలిగురియా, అధిక అయాన్ గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్, ప్రీ రీనల్ అజోటెమియా కూడా ఉందని అపోలో వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నామని, ఈరోజు లేదా రేపు డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. వైఎస్ షర్మిల రెండు, మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
Next Story