Mon Dec 23 2024 07:15:56 GMT+0000 (Coordinated Universal Time)
డిప్యూటీ కలెక్టర్‌ను కరిచిన కుక్క
సిద్ధిపేట కలెక్టర్ క్వార్టర్స్‌లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరెడ్డిని కుక్క కరించింది.
సిద్ధిపేట కలెక్టర్ క్వార్టర్స్‌లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరెడ్డిని కుక్క కరించింది. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరెడ్డిని సిద్ధిపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. డిప్యూటీ కలెక్టర్ పై దాడి చేసిన కుక్క ఆ తర్వాత ఒక బాలుడిపై కూడా దాడి చేసి కరిచిందని స్థానికులు చెబుతున్నారు.
కలెక్టర్ క్వార్టర్స్ వద్ద...
కలెక్టర్ క్వార్టర్స్ వద్ద కుక్కలు ఉన్నా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కుక్కుల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు ఫిర్యాదులు చేసినా సిబ్బంది లైట్ గా తీసుకోకపోవడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. డిప్యూటీ కలెక్టర్‌ను కరిచిన తర్వాత కాని అధికారులు మేల్కొనలేదు.
Next Story