Sat Dec 21 2024 16:23:55 GMT+0000 (Coordinated Universal Time)
12లోపు ఏపీలో రిపోర్ట్ చేయండి : సోమేష్ కుమార్ కు ఆదేశాలు
తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ను వెంటనే రిలీవ్ అవ్వాలని డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది
తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ను వెంటనే రిలీవ్ అవ్వాలని డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన వెంటనే ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈనెల 12వ తేదీ లోపు ఏపీలో రిపోర్టు చేయాలని సోమేష్ కుమార్ ను ఆదేశించింది. తెలంగాణలో సోమేష్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో డీవోపీటీ నుంచి ఈ మేరకు ఆదేశాలు అందాయి.
కొత్త సీఎస్ గా...
అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కొత్త సీఎస్ గా ఎవరిని నియమించాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. నూతన సీఎస్ గా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఫైనాన్స్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణరావు, ఇరిగేషన్ ప్రధాన కార్యదర్శి రజిత్ కుమార్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అరవింద్కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో అరవింద్ కుమార్ కేటీఆర్కు సన్నిహితుడు. అయితే ఎవరిని నియమించాలన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదంటున్నారు.
Next Story