Mon Dec 23 2024 03:07:16 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో అందుబాటులోకి డ్రోన్ అంబులెన్స్!!
త్వరలోనే తెలంగాణలో అందుబాటులోకి రానున్నాయని
డ్రోన్ అంబులెన్స్ లు వస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ ను తప్పించుకుని సమయానికి రోగులను, బాధితులను ఆసుపత్రులకు చేర్చొచ్చు. ఇలాంటి సదుపాయాలను తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నారు.
డ్రోన్ అంబులెన్సులు త్వరలోనే తెలంగాణలో అందుబాటులోకి రానున్నాయని హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి తెలిపారు. రోగితో పాటు ఆక్సిజన్ సిలిండర్, ఇతర కీలక పరికరాలు, ప్రాథమిక వైద్య సేవలందించే నర్సు కలిపి సుమారు 200 కిలోల బరువు మోసుకెళ్లే సామర్థ్యమున్న డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఐఐటీలోని థిహాన్ అనే ప్రత్యేక విభాగంలో ఈ డ్రోన్ టెక్నాలజీపై పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలిపారు.
రాబోయే కాలంలో టెక్నాలజీ ఎంతో డెవలప్ కాబోతోందని అలాగే తల్లిదండ్రులకు లక్ష్యాలను నిర్దేశించే విషయమై కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని మూర్తి సూచించారు. తల్లిదండ్రులు పిల్లలకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తే చాలని అనుకుంటున్నారని, తమ పిల్లలను కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సులు చదివించేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారని, తల్లిదండ్రుల ఆలోచనా విధానం మారాలన్నారు. పిల్లలకు ఆసక్తి ఉన్న సబ్జెక్టులు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.
Next Story