Mon Dec 23 2024 07:35:34 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రేపటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం.. స్పష్టతనిచ్చిన ప్రభుత్వం
రేపటి నుంచి తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి
రేపటి నుంచి తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నా యి. విద్యార్ధులు, నిరుద్యో గుల ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై కొంత గందరగోళం నెలకొంది. టెట్ నిర్వహణ, డిఎస్సీ ప్రిపరేషన్ వ్యవధి సరిపో వడం లేదంటూ అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయాలంటూ గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది.
ఆగస్టు 5వ తేదీ వరకూ...
తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహిస్తున్న డిఎస్సీ పరీక్షలు గురువారం జూలై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆన్ లైన్ లో పరీక్షలు జరుగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 11,062 పోస్టుల భర్తీకి 2.79 లక్షల దరఖాస్తులు అందాయి. పరీక్షలు రేపటి నుంచి ప్రారంభమై ఆగస్టు 5వ తేదీ వరకు జరుగు తాయి. మంగళవారం సాయంత్రానికి 2,40,727 మంది హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిఎస్సీ పరీక్షలు రోజుకు రెండు విడతల్లో నిర్వహించనున్నారు.
Next Story