Mon Dec 23 2024 14:39:59 GMT+0000 (Coordinated Universal Time)
KTR : వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టండి
అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందన్నారు
రేవంత్ రెడ్డి వట్టి మాటలు కట్టిపెట్టి పనులు చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. రైతుభరోసా నిధులను ఇంత వరకూ విడుదల చేయకపోవడానికి కారణాలేంటని ఆయన ప్రశ్నించారు. తాను విదేశాల్లోనే చదివానని, రేవంత్ రెడ్డి అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. రైతులను మోసం చేస్తూ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫేస్టోలో అరచేతిలో స్వర్గం చూపించిందన్నారు. బడ్జెట్ లో మాత్రం మోచేతికి బెల్లం పెట్టిందని అన్నారు.
పదేళ్ల కాలంలో...
పదేళ్ల కాలంలో తెలంగాణ అభివృద్ధి చెందిందన్న కేటీఆర్ పదే పదే రాష్ట్రం దివాలా తీసిందని చెబితే పెట్టుబడులు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. అప్పుల గురించి చెప్పేవాళ్లు ఆస్తుల గురించి కూడా చెప్పాలన్నారు. తెలంగాణ ఆస్తులు ఎన్నో లెక్కతీయండని కేటీఆర్ సవాల్ విసిరారు. వాస్తవాలు చెప్పకుండా అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రజోపయోగమైన నిర్ణయాలకు తమకు సహకారం అందిస్తామని తెలిపారు. అదే సమయంలో ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలకు టాటా చెప్పడమే కాకుండా లంకె బిందెల వేట కొనసాగిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
Next Story