Mon Dec 23 2024 08:20:32 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : బీఆర్ఎస్ కు షాకింగ్ న్యూస్
తెలంగాణలో ఎన్నికల సమయంలో భారత రాష్ట్ర సమితికి భారీ షాక్ తగిలింది. సుప్రీంకోర్టులో చుక్కెదురైంది
తెలంగాణలో ఎన్నికల సమయంలో భారత రాష్ట్ర సమితికి భారీ షాక్ తగిలింది. సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆ పార్టీ దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బీఆర్ఎస్ వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. కారు గుర్తు పోలిన సింబల్స్ ను మరొకరికి కేటాయించవద్దని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది.
ఫ్రీ సింబల్స్ జాబితాలో...
దీంతో పాటు ఫ్రీ సింబల్స్ జాబితాలో కారు గుర్తును తొలగించాలని కూడా కోరింది. అయితే ఈ పిటీషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటీషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఏ గుర్తులను ఎవరికి కేటాయిస్తుందన్న దానిపై పార్టీలో టెన్షన్ నెలకొంది.
Next Story