Fri Nov 22 2024 22:18:18 GMT+0000 (Coordinated Universal Time)
Mallu Bhatti Vikramarka : మీ సంస్థను మీరే కాపాడుకోండి
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్కులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పంపిణీ చేశారు.
తాము అధికారంలోకి వచ్చే నాటికి ఆర్టీసీ దివాలా తీసి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్కులను పంపిణీ చేశారు. లాభాల్లో వాటా కార్మికులందరికీ ఇస్తున్నామన్నారు. కేవలం పర్మినెంట్ కార్మికులకే కాదు, కాంట్రాక్టు కార్మికులకు కూడా తాము బోనస్ ఇస్తున్నామని తెలిపారు. ఒక్కొక్క కార్మికుడికి 2.19 లక్షలు బోనస్ ఇస్తున్నామని తెలిపారు. ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు. మీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖర్చులు తగ్గించుకుని లాభాలు ఎక్కువగా తెచ్చుకుంటే ఆ లాభాలు కూడా మీకే చెందుతాయని తెలిపారు.
బావి వద్ద సమావేశాలు...
అలాగే కార్మికులు కూడా సింగరేణి సంక్షేమం కోసమే పనిచేయాలని మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సింగరేణిని కాపాడుకునే బాధ్యత కార్మికులదేనని తెలిపారు. ప్రతి బావి వద్ద పండగ పూట కార్మికులకు విందు ఏర్పాటు చేసి, ఈ సంస్థ ప్రయోజనాలు ఏంటో వివరించాలని మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈ సమావేశాలకు మంత్రులను, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించాలని తెలిపారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే తమ లక్ష్యమని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.
Next Story