Fri Nov 22 2024 21:14:53 GMT+0000 (Coordinated Universal Time)
ఈ-ఛలాన్ సర్వర్ డౌన్.. పెండింగ్ ఛలాన్ల క్లియరెన్స్‌కు అంతరాయం
టూ వీలర్లకు 75 శాతం, కార్లకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 30 శాతం, తోపుడు బండ్లకు 80 శాతం మేర రాయితీ ఇచ్చింది.
హైదరాబాద్ : వాహనాలపై ఉన్న ఛలాన్లను క్లియర్ చేసేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఇచ్చిన రాయితీకి వాహనదారుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. పెండింగ్ ఛలాన్లను క్లియర్ చేసేందుకు లక్షలాది మంది వాహనదారులు ఈ -ఛలాన్ వెబ్ సైట్ కు క్యూ కట్టారు. దాంతో వెబ్ సైట్ కాస్తా క్రాష్ అయి, సర్వర్ డౌన్ అయింది. ఫలితంగా ఛలాన్ల క్లియరెన్స్ కు అంతరాయం ఏర్పడింది. ఛలాన్ కడతామని వెబ్ సైట్ ఓపెన్ చేద్దామంటే.. తెరుచుకోవడం లేదని, సైట్ డౌన్ అయిందంటూ వాహనదారులు వాపోతున్నారు. లక్షల్లో పేరుకుపోయిన ఛలాన్లను క్లియర్ చేయించేందుకు పోలీస్ శాఖ రాయితీలు ప్రకటించింది.
Also Read : ఏపీ కేబినెట్ భేటీ వాయిదా
టూ వీలర్లకు 75 శాతం, కార్లకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 30 శాతం, తోపుడు బండ్లకు 80 శాతం మేర రాయితీ ఇచ్చింది. మార్చి 1 నుంచి 31వ తేదీ లోపు పెండింగ్ ఛలాన్లను క్లియర్ చేసేందుకు వెసులుబాటు కల్పించారు పోలీసులు. దీంతో తొలిరోజైన మంగళవారమే ఛలాన్ల క్లియరెన్స్ కు వాహనదారులు పోటెత్తారు. రోజుకు లక్ష నుంచి 3 లక్షల మంది వాహనదారులు ఛలాన్ల క్లియరెన్స్ లు చేస్తారని పోలీసుల అంచనా వేశారు. ఆ ఒత్తిడిని తట్టుకునేలా వెబ్ సైట్ ను అప్ డేట్ చేశారు కూడా. కానీ.. తొలిరోజే 3 లక్షలకు పైగా వాహనదారులు ఈ-ఛలాన్ వెబ్ సైట్‌ను ఆశ్రయించడంతో సైట్ డౌన్ అయిపోయింది. నెలాఖరు వరకూ సమయం ఉంది కాబట్టి వాహనదారులు ఇబ్బంది పడొద్దని, వెబ్ సైట్ ను పునరుద్ధరిస్తామని పోలీసులు తెలిపారు.
Next Story