Fri Nov 22 2024 13:41:33 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఎంసెట్, ఈసెట్ ఫలితాల విడుదల
నేడు ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు
నేడు ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. జులై 18 నుంచి 21 వ తేదీ వరకూ ఇంజినీరింగ్, 30,31వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాల కోసం వేల సంఖ్యలో విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఇంజినీరింగ్ పరీక్ష కు 5,56,812 మంది హాజరయ్యారు. అగ్రికల్చర్ , ఫార్మా కోసం 80,575 మంది హాజరయ్యారు.
ఎదురు చూపులు...
అలాగే ఈసెట్ ను ఈ నెల 1వ తేదీన నిర్వహించారు. ఈ పరీక్షకు 9,402 మంది హాజరయ్యారు. వీరంంతా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. మరికాసేపట్లో ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ కీ విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. దాని ప్రకారం సరి చూసుకున్న తర్వాతనే ఫలితాలను విడుదల చేయాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది.
Next Story