Mon Dec 23 2024 13:39:18 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో ఈడీ దాడులు.. ఏకకాలంలో 16 ప్రాంతాల్లో..
కామినేని ఆసుపత్రి చైర్మన్ సూర్యనారాయణ, ఎండీ శ్రీధర్ నివాసాల్లోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ బృందాలతో పాటు ..
మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల శంఖారావం మోగనున్న నేపథ్యంలో తెలంగాణ వరుసగా ఐటీ, ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. గతేడాది రాష్ట్రంలో ఈడీ, ఐటీ సోదాలు జోరుగా జరగ్గా.. ప్రస్తుతం బీఆర్ఎస్..అప్పటి టీఆర్ఎస్ కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు విచారణలకు కూడా హాజరయ్యాయి. ఇటీవలే బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ ఇళ్లు, కార్యాలయాలపై కూడా ఐటీ అధికారులు దాడులు చేసి.. సోదాలు నిర్వహించారు. సుమారు మూడురోజులపాటు జరిగిన సోదాల్లో.. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. బుధవారం మహబూబ్ నగర్, హైదరాబాద్ లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ రీసెర్చ్ సెంటర్, కామినేని, ప్రతిమ తదితర కళాశాలలతో పాటు మల్లారెడ్డి కాలేజీల్లోనూ ఏకకాలంలో 11 బృందాలు సోదాలు నిర్వహించాయి. కామినేని ఆసుపత్రి చైర్మన్ సూర్యనారాయణ, ఎండీ శ్రీధర్ నివాసాల్లోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ బృందాలతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలు కూడా ఉన్నాయి. నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్ జిల్లాల్లోనూ ఈడీ దాడులు జరిగాయి. పీజీ మెడికల్ సీట్ల కేటాయింపుల కేసులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. అయితే ఈ దాడుల వెనుక ఆరోపణలేమైనా ఉన్నాయా ? ఏ ఆధారాలతో దాడులు నిర్వహించారన్నది తెలియాల్సి ఉంది. గతంలో కూడా మంత్రి మల్లారెడ్డికి చెందిన కాలేజీలు, ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరపడం సంచలనం రేపింది. ఈ తనిఖీలలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. ఫలింతగా ఆయన ఐటీ విచారణకు హాజరయ్యారు. ఇక మరో మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి.
Next Story