Mon Dec 23 2024 13:47:18 GMT+0000 (Coordinated Universal Time)
మెడికల్ కాలేజ్ సీట్ల స్కాం : భారీగా నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం
మొత్తం 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ.. మల్లారెడ్డి కాలేజీతో పాటు ప్రముఖ మెడికల్ కాలేజీల్లో..
తెలంగాణలో మెడికల్ కాలేజీ సీట్ల స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఫిబ్రవరి 2022 లో కాళోజీ యూనివర్సిటీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత నెలలో తెలంగాణలోని పలు మెడికల్ కాలేజీలపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ.. మల్లారెడ్డి కాలేజీతో పాటు ప్రముఖ మెడికల్ కాలేజీల్లో మెడికల్ సీట్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. 2016 నుంచి 2022 వరకూ మెడికల్ కాలేజ్ పీజీ అడ్మిషన్ లలో గోల్ మాల్ జరిగినట్లు సమాచారం.
మొత్తం రూ.100 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. మెడికల్ కాలేజీల్లో సాదాల అనంతరం భారీగా నగదు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది ఈడీ. మంత్రి మల్లారెడ్డి కుమారులతో పాటు పలు మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు ఈ మేరకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మెడికల్ సీట్ల కేటాయింపుల స్కామ్ లో మల్లారెడ్డి కాలేజీ చైర్మన్ గా ఉన్న భద్రారెడ్డికి, జనరల్ సెక్రటరీగా ఉన్న మహేందర్ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం.
Next Story