Sun Dec 29 2024 10:07:01 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు
తెలంగాణలో నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం అవుతున్నాయి. కరోనా తీవ్రత తగ్గుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది
తెలంగాణలో నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం అవుతున్నాయి. కరోనా తీవ్రత తగ్గుతుండటంతో ప్రభుత్వం విద్యాసంస్థలను తెరవాలని నిర్ణయించింది. అయితే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ విద్యాసంస్థలు పనిచేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉండేందుకు సత్వరం పాఠశాలలు, కళాశాలలు తెరవడం మంచిదని ప్రభుత్వం అభిప్రాయపడి ఈ నిర్ణయం తీసుకుంది.
కరోనా తీవ్రత....
సంక్రాంతి సెలవులను విద్యాసంస్థలకు కరోనా తీవ్రత కారణంగా జనవరి 31వ తేదీ వరకూ పొడిగించారు. కరోనా తీవ్రత ఉన్న రాష్ట్రాల్లో సయితం పాఠశాలలకు సెలవులు ఇవ్వలేదు. కరోనా తీవ్రత పెద్దగా లేకపోవడం, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉండటంతో పాఠశాలలను తెరవాలని నిర్ణయించింది. ఈరోజు నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. సీబీఎస్ సిలబస్ బోధించే పాఠశాాలలు మాత్రం ఈ నెల 2 నుంచి తెరుచుకోనున్నాయి.
Next Story