Fri Mar 14 2025 23:40:29 GMT+0000 (Coordinated Universal Time)
SLBC Accident : కోట్లు ఖర్చు చేస్తున్నా ఏడుగురి జాడ తెలియకపాయె
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రమాదంలో కార్మికుల జాడ తెలుసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రమాదంలో కార్మికుల జాడ తెలుసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మృతదేహల కోసం రెస్క్యూ ఆపరేషన్ నేటికి 21వ రోజుకు చేరుకుంది. ఏడుగురు మృతదేహాలను వెతికేందుకు నిరంతరం శ్రమిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ప్రభుత్వం రోజుకు రెస్క్యూ ఆపరేషన్ కు వినియోగించే రోబోల కోసం నాలుగు కోట్ల రూపాయలు వ్యయం చేస్తుంది. కేరళ నుంచి కడావర్ డాగ్స్ ను తెప్పించడం నుంచి రోబోలను తెప్పించి అన్వేషణ చేస్తున్నారు. మట్టి, బురద తవ్వకాలకు ఆటంకంగా మారింది.
డాగ్స్ గుర్తించిన..
సొరంగంలో రెండు రోబోలు పనిచేస్తున్నాయి. కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2, డీ1 పాయింట్లమధ్య పన్నెండు మీటర్ల దూరం ఉందని సహాయక బృందాలుత ెలిపాయి. ఈ ప్రాంతంలోనే టీబీఎం మిషన్ కూలిపోయింది. పైకప్పు విరిగిపడింది. ఈ ప్రాంతంలోనే మృతదేహాలు ఉంటాయని కడావర్ డాగ్స్ గుర్తించడంతో అక్కడ తవ్వకాలు జరిపేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. టీబీఎం మిషన్ ను కట్ చేస్తున్నారు. ఆ శిధిలాలను తొలగించి బయటకు తీసుకు రావడం కూడా కష్టంగా మారడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.
ప్రమాదకరమైన పరిస్థితి...
దీంతో పాటు కార్మికుల మృతదేహాలున్న చోట మాత్రం ప్రమాదకరమైన పరిస్థితులున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అక్కడకు వెళ్లాలంటే రిస్క్ తో కూడుకున్న వ్యవహారమని అంటున్నారు. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నామని, అక్కడ హోలో స్పేస్ లో ఖాళీగా ఉన్న ప్రదేశంలోనే కార్మికుల మృతదేహాలున్నట్లు అంచనాకు వచ్చిన సహాయక బృందాలు అక్కడకు వెళ్లేందుకు రెండు రోబోలను ఉపయోగిస్తున్నాయి. షిప్ట్ లలో నిరంతరం పన్నెండు సహాయక బృందాలు పనిచేస్తున్నప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో తదుపరి చర్యలపై చర్చలు జరుపుతున్నారు.
Next Story