Mon Dec 23 2024 16:37:52 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఎనిమిది కోట్లు ఫ్రీజ్.. వేరొక అకౌంట్ కు బదిలీ చేసినందుకు
విశాఖ ఇండ్రస్ట్రీకి చెందిన 8 కోట్లను ఫ్రీజ్ చేశారు. అనుమానిత అకౌంట్లలోకి 8 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్లు కనుగొన్నారు
విశాఖ ఇండ్రస్ట్రీకి చెందిన ఎనిమిది కోట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. అనుమానిత అకౌంట్లలోకి ఎనిమిది కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్లు అధికారులు కనుగొన్నారు. విశాఖ ఇండ్రస్ట్రీతో పాటు విజిలెన్స్ సెక్యూరిటీ అకౌంట్‌ను కూడా అధికారులు ఫ్రీజ్ చేశారు. విజిలెన్స్ సెక్యూరిటీకి సంబంధించిన అకౌంట్ లోకి ఎనిమిది కోట్ల రూపాయలను విశాఖ ఇండ్రస్ట్రీ బదిలీ చేసింది.
విజిలెన్స్ సెక్యూరిటీకి...
ఈ బదిలీకి సంబంధించి సెంట్రల్ జోన్ లోని హెచ్డీఎఫ్సి బ్యాంకులో ఉన్న అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. కాగా విశాఖ ఇండ్రస్ట్రీ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ కు సంబంధించిందని చెబుతున్నారు. ఆయన చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇటీవలే వివేక్ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నగదు బదిలీకి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Next Story