Tue Apr 08 2025 09:34:00 GMT+0000 (Coordinated Universal Time)
బతికి ఉంటారన్న ఆశలు లేవు..72 గంటలుగా నిరీక్షణ
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో శనివారం జరిగిన ప్రమాదంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మకుల జాడ తెలియడం లేదు

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో శనివారం జరిగిన ప్రమాదంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మకుల జాడ తెలియడం లేదు. గత 72 గంటలుగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. దాదాపు మూడు రోజులకు పైగానే వారు టన్నెల్ లో చిక్కుకుపోయి ఉండటంతో ఎనిమిది మంది కార్మికులు బతికి ఉంటారన్న ఆశలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. ఎన్.డి.ఆర్.ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీంలు ఎంతగా ప్రయత్నించినా ఫలితం కనిపించడం లేదు. మొత్తం పథ్నాలుగు మీటర్ల దూరంలో కార్మికులు చిక్కుకుపోయారు. పదకొండున్న కిలోమీటర్ల వరకే సహాయక బృందాలు వెళుతున్నాయి. అక్కడి నుంచి వెళ్లాలంటే బురద, నీరు సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి.
సహాయక చర్యలకు ఆటంకం...
టన్నెల్ బోరింగ్ యంత్రం విరిగిపడటంతో సహాయక చర్యలను వేగంగా ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. లోపల ఆక్సిజన్ అందే అవకాశం కూడా లేదని భావించి ఆక్సిజన్ లోపలకి పంప్ చేస్తున్నప్పటికీ ఎంత మాత్రం ఫలితం ఉంటుదన్నది మాత్రం చెప్పలేకపోతున్నామని అధికారులు ఒక కన్ క్లూజన్ కు వచ్చేశారు. అనేక రెస్క్యూ టీంలు రంగంలోకి దిగి టన్నెల్ లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ కార్మికుల ఆచూకీ తెలియకపోవడంతో ప్రతి రోజూ వెళ్లడం, వెనక్కు తిరిగి రావడం వంటివి చేస్తున్నారు. ఉన్నతాధికారులు అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నప్పటికీ ఎన్.డి.ఆర్.ఎఫ్ సిబ్బంది వల్ల కావడం లేదు. మూడు రోజుల నుంచి తాగేందుకు నీరు, తినేందుకు భోజనం లేక కార్మికుల పరిస్థితి ఎలా ఉందోనన్న ఆందోళన నెలకొంది.
టన్నెల్ బోరింగ్ యంత్రాన్ని...
టన్నెల్ బోరింగ్ యంత్రాన్ని తొలగిద్దామంటే మరోసారి పై కప్పు విరిగిపడే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే ఆ ప్రయత్నాన్ని మానుకున్నట్లు చెబుతున్నారు. టన్నెల్ బోరింగ్ యంత్రాన్నితొలగించి ముందుకు వెళితేనే కార్మికుల జాడ తెలియనుందని రెస్క్యూ టీం సిబ్బంది తెలిపారు. కనీసం లోపలకు వెళ్లాలంటే పదకొండు కిలోమీటర్ల మేరకే సాధ్యమవుతుంది. మరో మూడు కిలోమీటర్ల వెళ్లేందుకు మాత్రం అసాధ్యంగా మారడంతో రెస్క్యూ టీంలు వెనుదిరిగి వస్తున్నాయి. దీంతో కార్మికులు బతికి ఉంటారన్న నమ్మకం లేదని ఎన్.డీ.ఆర్.ఎఫ్ సిబ్బంది చెబుతున్నారు. లోపల నీరు అంతకంతకూ పెరగడంతో పాటు టీబీఎం యంత్రం వెనక మట్టి పేరుకుపోయి ఉండటం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది.
Next Story