Mon Dec 23 2024 18:30:52 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిలకు షాక్... ఆ పేరు దక్కదేమో?
వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిలకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆమె తెలంగాణలో వైఎస్సార్టీపీ ని స్థాపించిన సంగతి తెలిసిందే
వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిలకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆమె తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ ని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ఎన్నికల కమిషన్ నుంచి అభ్యంతరాలు ఎదురయినట్లు తెలుస్తోంది. పార్టీ పేరు రిజిస్ట్రేషన్ కు కూడా నోచుకోలేదు. తెలంగాణలో అన్న వైఎస్సార్ పేరుతో పార్టీ ఉంది. వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎన్నికల కమిషన్ దీనిపై షర్మిలకు సమాచారం అందించినట్లు తెలిసింది.
అభ్యంతరాలు రావడంతో....
అన్న వైఎస్సార్ పార్టీ వారు ఇచ్చిన ఫిర్యాదును ఎన్నికల కమిషన్ స్వీకరించింది. దీంతో షర్మిల పెట్టిన వైఎస్సార్టీపీ గుర్తింపు విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. మరి షర్మిల పార్టీకి ఎన్నికల కమిషన్ నుంచి గుర్తింపు లభిస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
- Tags
- ys sharmila
- ysrtp
Next Story