Mon Dec 15 2025 00:12:20 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూలు విడుదల చేసింది. టీచర్, పట్టభద్రుల స్థానానికి కూడా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ ను విడుదల చేసింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి పరిధిలోని టీచర్ ఎమ్మెల్సీ పదవికి ఎన్నికలు జరగనుండగా, ఆంధ్రప్రదేశ్ లో 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది.
టీచర్, పట్టభద్రుల...
రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికలకు ఫిబ్రవరి 16వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది. మార్చి 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు టీచర్ ఎమ్మెల్సీ, కడప, అనంతపురం, కర్నూలు టీచర్ ఎమ్మెల్సీ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు - కడప, అనంతరపురం, కర్నూలు - శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది.
Next Story

