Mon Dec 23 2024 14:30:05 GMT+0000 (Coordinated Universal Time)
పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. వాహనం దగ్ధం
రామడుగు మండలం రామచంద్రాపురానికి చెందిన ఎగుర్ల ఓదెలు అనే వ్యక్తి రెండు నెలల క్రితం బెన్లింగ్ ఫాల్కన్ కంపెనీకి
రామచంద్రాపురం : ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ బైక్ లు, వాటి బ్యాటరీలు పేలిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో జరిగిన ఈ తరహా ఘటనల్లో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇటీవల నిజామాబాద్ లో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలిన ఘటన మరువక ముందే.. మరో ప్రాంతంలో ఇదే రిపీట్ అయింది. కానీ.. ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ లో ఉండగా పేలలేదు. ఛార్జింగ్ పెట్టి.. తీసేసిన కొద్ది నిమిషాలకు పేలడం గమనార్హం.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రాపురానికి చెందిన ఎగుర్ల ఓదెలు అనే వ్యక్తి రెండు నెలల క్రితం బెన్లింగ్ ఫాల్కన్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. ఎప్పటిలాగానే ఆదివారం రాత్రి కూడా పడుకునే ముందు బైక్ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాడు. ఛార్జింగ్ ఫుల్ అయ్యాక తీసేశాడు. బ్యాటరీ ఛార్జింగ్ తీసేసిన కొద్దినిమిషాలకే పెద్ద శబ్దంతో పేలిపోయింది. బ్యాటరీకి ఇంటి వెలుపల ఛార్జింగ్ పెట్టడం, బ్యాటరీ పేలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బైక్ దగ్ధమైంది.
కాగా.. బైక్ బ్యాటరీలు ఎందుకు పేలుతున్నాయో తెలియక సదరు తయారీ కంపెనీలు తలలు పట్టుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీల పేలుళ్ల నేపథ్యంలో.. ప్రముఖ సంస్థ అయిన ఓలా తమ ఎలక్ట్రిక్ బైక్ లను రీకాల్ చేసిన విషయం తెలిసిందే.
Next Story