Sun Nov 24 2024 18:15:07 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో విద్యతు ఛార్జీల షాక్... నేడో రేపో?
తెలంగాణలో విద్యుత్తు ఛార్జీలు పెరగనున్నాయి. రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది
తెలంగాణలో విద్యుత్తు ఛార్జీలు పెరగనున్నాయి. రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. ఛార్జీల భారాన్ని మోపడం తప్పడం లేదని విద్యుత్తు సంస్థలు చెబుతున్నాయి. 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ ను అందిచడం కారణంగా చార్జీలు పెంచాల్సి వస్తుందని ఈఆర్సీ సయితం అభిప్రాయపడింది. ఈ మేరకు విద్యుత్తు ఛార్జీల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది.
ప్రభుత్వం కూడా....
విద్యుత్తు ఛార్జీలను పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది. అయితే పేదలపై భారం పడకుండా స్లాబ్ ల వారీగా పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. ఎక్కువ స్లాబ్ లను వినియోగించే వారికి అధిక భారం పడనుందని సమాచారం.
Next Story