Mon Dec 23 2024 02:53:48 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో పెరగనున్న విద్యుత్తు ఛార్జీలు
తెలంగాణలో విద్యుత్తు ఛార్జీలు పెరగనున్నాయి. ఛార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
తెలంగాణలో విద్యుత్తు ఛార్జీలు పెరగనున్నాయి. ఛార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెరిగిన విద్యుత్తు ఛార్జీలు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. మీడియా సమావేశంలో విద్యుత్తు ఛార్జీల నియంత్రణ మండలి ఛైర్మన్ రంగారావు తెలిపారు. గృహ వినియోగదారులకు యూనిట్ కు యాభై పైసలు, పారిశ్రామిక విద్యుత్తుకు యూనిట్ కు రూపాయి ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఏప్రిల్ ఒకటి నుంచి......
వినియోగదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఈ ఛార్జీల నిర్ణయం జరిగిందన్నారు. 2022- 20 సంవత్సరానికి డిస్కమ్ లు ప్రతిపాదించిన రెవెన్యూ గ్యాప్ 16 వేల కోట్ల రూపాయలని, 14,237 కోట్ల రెవెన్యూ గ్యాప్ ను కమిషన్ ఆమోదించిందని రంగారావు తెలిపారు. వ్యవసాయ రంగానికి విద్యుత్తు టారిఫ్ ను పెంచడం లేదని చెప్పారు. అయితే ఆసక్తి ఉన్న వారు ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేసుకోవచ్చని కూడా తెలిపారు.
Next Story