Mon Dec 23 2024 11:46:41 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఈడీ సంచలన నిర్ణయం
టాలీవుడ్ డ్రగ్స్ కేసును మూసివేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నిర్ణయించింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసును మూసివేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నిర్ణయించింది. సరైన ఆధారాలు లభించక పోవడంతో ఈ కేసును మూసివేస్తూ నిర్ణయం తీసుకోనుంది. ఫెమా, హవాలా, మనీలాండరింగ్ వంటి అంశాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఈ కేసును క్లోజ్ చేసేందుకు ఈడీ రంగం సిద్దం చేసింది.
ఆధారాలు లభించక పోవడంతో....
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెలంగాణ సీఐడీ అనేక మందిని విచారించింది. వీరిలో హవాలా, ఫెమా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారని టాలీవుడ్ కు చెందిన 12 మంది ప్రముఖులను ఈడీ విచారించింది. దాదాపు పదిహేను రోజుల పాటు సాగిన విచారణలో ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో ఈడీ ఈ కేసును మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
Next Story